ఆ ఒక్కటీ అడగొద్దు ... సూపర్‌స్టార్‌

ఆ ఒక్కటీ అడగొద్దు ... సూపర్‌స్టార్‌

19-05-2017

ఆ ఒక్కటీ అడగొద్దు  ... సూపర్‌స్టార్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులతో భేటీ అయ్యారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వరుసగా అభిమానులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయరంగ ప్రవేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. దయ చేసి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దు అని రజనీ కోరారు. ఎనిమిదేళ్ల తరువాత ఫ్యాన్స్‌తో ఫొటోలు, సమావేశాలతో భవిష్యత్‌లో రాజకీయరంగ ప్రవేశంపై  ప్రకటన చేస్తారని  కథనాలు వెలువడ్డాయి. అభిమానులతో భేటీ అయిన 60 ఏళ్ల సూపర్‌స్టార్‌ దురలవాట్లకు దూరంగా ఉండండి. కుటుంబాలను చక్కగా చూసుకోండి. అంటూ ఫ్యాన్‌కు ఉద్బోధించారు. అంతేకాదు దూమపానం, ఆల్కాహాల్‌కు బానిసలు కావద్దని  కోరారు. రాజకీయాలపై తనకు ఆసక్తిలేదన్న రజనీ అంతా దేవుడి చేతుల్లో ఉంది. ఆయన ఎలా అంటే అలా జరుగుతుంది అన్నారు.