భారతీయుడు 2లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌!

భారతీయుడు 2లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌!

23-07-2019

భారతీయుడు 2లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌!

కాజల్‌ వదులుకున్న భారతీయుడు 2 ఆఫర్‌ని యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దక్కించుకుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రకుల్‌ జాక్‌పాట్‌ కొట్టేసినట్టే. వాస్తవానికి భారతీయుడు 2 రకరకాల కారణాలతో అంతకంతకు షూటింగ్‌ ఆలస్యమవుతోంది. ఒకసారి బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు వెనకంజ వేస్తే..మరోసారి కమల్‌ హాసన్‌ రాజకీయ షెడ్యూల్స్‌ బ్రేక్‌ వేశాయి. మరికొన్ని సాంకేతిక కారణాలు ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలుగా మారాయి. ఈ ఆలస్యం భరించలేక ఈ ప్రాజెక్టు నుంచి కాజల్‌ తప్పుకుంది. ఇక అన్ని చిక్కుల నుంచి బయటపడి ఎట్టకేలకు భారతీయుడు 2 షూటింగ్‌ని తిరిగి ప్రారంభించేందుకు దర్శకుడు శంకర్‌ సిద్ధమవుతున్నారు. కమల్‌హాసన్‌ బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ షూట్‌ పూర్తవగానే ఈ టీమ్‌తో జాయిన్‌ కానున్నారట. అలాగే భారతీయుడు 2లో కేవలం రకుల్‌కి మాత్రమే కాదు మరో ఇద్దరు కథానాయికలకు స్కోప్‌ ఉందని తెలిసింది. 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్‌.