సామ్‌ ...యూ టర్న్‌ తీసుకోవట్లేదు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

సామ్‌ ...యూ టర్న్‌ తీసుకోవట్లేదు

19-05-2017

సామ్‌ ...యూ టర్న్‌ తీసుకోవట్లేదు

ఓ భాషలో ఓ సినిమా హిట్టయిందంటే వెంటనే రీమేక్‌ చేయాలని తహతహలాడేస్తుంటారు కథానాయకులు. ఈ మధ్య హీరోయిన్లూ రీమేక్‌ సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా యూ టర్న్‌ అనే తమిళ సినిమాపై సమంత మనసు పడిందని, ఆ  చిత్రాన్ని తానే నిర్మాతగా తెలుగులో రీమేక్‌ చేయబోతోందని వార్తాలొచ్చాయి. యూటర్న్‌ నాకు బాగా నచ్చింది. అదృష్టం బాగుంటే నేనే చేస్తా అని సమంత కూడా పలు సందర్భాల్లో చెప్పింది. అయితే ఈ సినిమా నుంచి సమంత డ్రాప్‌ అయ్యిందట. రీమేక్‌ చేస్తే కథలో ఉన్న గాఢత తగ్గిపోతుందని, తెలుగులో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయడం కష్టమని సమంత భావించిందట. అందుకే ఈ సినిమా వదులుకొందని తెలుస్తోంది. సమంత స్థానంలో మరో కథానాయిక వస్తుందా? లేదంటే ఈ రీమేక్‌నే ఆపేస్తారా? అనేది మాత్రం తెలియాల్సివుంది.