బాహుబలి మరో రికార్డ్‌
MarinaSkies
Kizen
APEDB

బాహుబలి మరో రికార్డ్‌

19-05-2017

బాహుబలి మరో రికార్డ్‌

ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ రికార్డుని బద్దలు కొడుతుందని ఎప్పుడైనా ఊహించామా. అతి తక్కువ టైంలో మన ప్రాంతీయ చిత్రానికి ఇన్ని కోట్ల వసూళ్ళ వస్తాయని కలగన్నామా. కాని అందరి అంచనాలను మించి రాజమౌళి చెక్కిన బాహుబలి శిల్పం చరిత్ర సృష్టించింది. నెంబర్‌ వన్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా అవతరించింది. రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ బాహుబలి 2 చిత్రం  తాజాగా 1500 కోట్ల మార్కుని చేరుకుంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అఫీషియల్‌గా ప్రకటించింది. మూడు వారాలలోనే ఈ సినిమా ఆ రికార్డు చేరుకోవడం అభినందనీయం. ట్రేడ్‌ లెక్కల ప్రకారం బాహుబలి 2 ఇండియాలో 953 కోట్ల కలెక్షన్స్‌ సాధించగా, ఓవర్సీస్‌లో 275 కోట్ల  వసూళ్ళని రాబట్టింది.  ఇక గ్రాస్‌ వసూళ్ళు రూ.1,227 కోట్లు అని చెబుతున్నారు. మొత్తంగా ఏప్రిల్‌ 28న విడుదల అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1502 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి ఇండియన్‌ మూవీ కీర్తిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. ఈ సినిమా సాధించిన ఘనతకు ప్రతి భారతీయుడు చాలా గర్వపడుతున్నాడు. ముఖ్యంగా మన తెలుగు వారు కాలర్‌ ఎత్తుకొని తిరుగుతున్నారు. బాహుబలి 2 చిత్రం పాకిస్థాన్‌ లోను సక్సెస్‌ పుల్‌ గా రన్‌ అవుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందంటే ఈ చిత్రం కలుగజేసిన వైబ్రేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా దేవసేన, శివగామి పాత్రలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన బాహుబలి చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యంలో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యారాజ, రమకృష్ణ నటించారు.