మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'
MarinaSkies
Kizen
APEDB

మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'

19-05-2017

మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'

బిగ్ విగ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక జంటలుగా కిశోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఓ పిల్లా నీ వల్ల. ఈ చిత్ర విడుదల తేదీని దర్శక నిర్మాత ఎన్ శంకర్ చే ప్రకటించారు ఓ పిల్లా  నీ వల్ల యూనిట్. ఈ సందర్బంగా అతిథి ఎన్ శంకర్ మాట్లాడుతూ బిగ్ వింగ్ బ్యానర్ లో కిశోర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. కిశోర్ లండన్ లో చదువుకున్నా సినిమా పై ఉన్న ప్యాషన్ తో  తన స్నేహితుడు మౌర్య సహకారం తో  ఈ సినిమా చేసాడు.  సినిమా చూసానేను   యంగ్  బ్లడ్ ఉరక లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా.  ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, యూత్ ను ఆకట్టుకునే సన్నివేశాలు , ఇక  మ్యూజిక్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంది.  చాలా బాగోచ్చింది చిత్రం మే 26 న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో థియేటర్లు కూడా బుక్ అయ్యాయి. అందరూ సినిమాను చూసి టీం ను మరిన్ని మంచి సినిమాలు చేసేలా  ప్రోత్సహించాలని కోరుతున్నా అన్నారు.

ఈచిత్ర దర్శకుడు, నిర్మాత కిషోర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తీయడానికి చాలా కష్టపడ్డాము.  ఇవన్నీ దాటి విడుదల చేసే వరకు వచ్చాము.  నా స్నేహితుడు మౌర్య సహకారం తోనే ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సందర్బంగా అతనికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా,  రెండు ప్రేమ జంటల మధ్య అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుందో తెలిపే కథాశం. మ్యూజిక్ ఈ సినిమా కు హైలెట్ అని చెప్పొచ్చు.   కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. రెండు ప్రేమ జంటల కథ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కిశోర్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది కనుక అందరికీ నచ్చుతుందని హీరో కృష్ణ చైతన్య తెలిపారు.  కొరియోగ్రాఫర్ జిత్తు మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి సింగల్ కార్డ్ అవకాశాన్ని ఇచ్చిన కిశోర్ గారికి నా కృతజ్ఞత లని తెలిపారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సుదర్శన్, అశోక్, రాజేష్ రాథోడ్, సూర్య శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.