భారతీయుడు 2 సెట్‌లో రకుల్‌ సందడి

భారతీయుడు 2 సెట్‌లో రకుల్‌ సందడి

13-08-2019

భారతీయుడు 2 సెట్‌లో రకుల్‌ సందడి

తెలుగులోని అగ్ర కథా నాయికల్లో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. వీరిద్దరూ ఇప్పటివరకూ ఒక్క చిత్రంలోనూ కలిసి నటించలేదు. ఇప్పుడు నటిస్తున్నారు. ఇండియన్‌ 2 (తెలుగులో భారతీయుడు 2)లో కలిసి సందడి చేయనున్నారు. ఇండియన్‌ కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌కి జంటగా కాజల్‌ నటిస్తుండగా.. యువ హీరో సిద్థార్థ్‌ సరసన రకుల్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. భారతీయుడు సెట్‌లో సందడి చేశారామో. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ రకుల్‌ ప్రారంభించారు.