నాకు పెళ్లంటే భయం!

నాకు పెళ్లంటే భయం!

13-08-2019

నాకు పెళ్లంటే భయం!

నేను చాలా స్వేచ్ఛగా పెరిగాను. నాకు ఏం కావాలో తెలుసు. నా అవసరాలను నా అంతట నేను తీర్చుకోగలను. అన్నీ ఉన్న ఈ తరుణంలో ఇంకో వ్యక్తితో కొత్తగా జీవితాన్ని పంచుకోవడమంటే నాకు చాలా భయంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు పెళ్లంటే భయం అని అన్నారు శ్రుతీ హాసన్‌. పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ పెళ్లి గురించి నిర్భయంగా ఆలోచించే రోజు వస్తుందని అనుకుంటున్నా. అలాంటి సమయంలో నాకు తారసపడేవారిలో మంచి వ్యక్తిని ఎంపిక చేసుకుంటానేమో. ఎదుటివ్యక్తిలో దయ, రుణ, జాలి ఉన్నాయో.. లేవో.. నేను ఇట్టే కనిపెట్టగలను. నేను చేసుకునేవారికి మాత్రం ఇవన్నీ ఉండాలి. వాటికి తోడు తెలివి ఉండాలి. కొంచెం గడ్డం ఉండాలి. గడ్డం లేని వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను. మా పెళ్లయ్యాక మా ఇంట్లో రేసర్లు, బ్లేడ్లు నిషిద్ధం. గడ్డం ట్రీమ్‌ చేసుకోవడానికి మాత్రం అంగీకరిస్తా (నవ్వుతూ).. నిజాయతీపరుడితో జీవితం గడిపే అవకాశం దొరికితే అదృష్టంగా భావిస్తా అని చెప్పారు.