'కూలీ నెం. 1' ఫస్ట్‌లుక్‌ విడుదల

'కూలీ నెం. 1' ఫస్ట్‌లుక్‌ విడుదల

13-08-2019

'కూలీ నెం. 1' ఫస్ట్‌లుక్‌ విడుదల

వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం కూలీ నెం.1. అదే పేరుతో గోవిందా, కరిష్మా కపూర్‌ జంటగా నటించిన చిత్రానికి రీమేక్‌ ఇది. వరుణ్‌ ధావన్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సారా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. ఒక పోస్టర్‌లో ఎర్ర చొక్కా, తెల్ల ప్యాంటు, తలపై తెల్ల టోపీ, నడుముకు బెల్టు, మెడలో తువ్వాలుతో అచ్చమైన రైల్వే కూలీలా కనిపిస్తున్న వరుణ్‌ లగేజీ ట్రాలీతో పోజివ్వగా, మరో పోస్టర్‌లో అదే గెటప్పుతో సారాను హత్తుకుని రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సారా నీ పుట్టినరోజు కానుకగా ఈ పోస్టర్‌లను తెచ్చాను అని ట్వీట్‌ చేశారు వరుణ్‌. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.