గ్రాఫిక్స్‌ వర్క్‌లో ఎర్రచీర

గ్రాఫిక్స్‌ వర్క్‌లో ఎర్రచీర

11-09-2019

గ్రాఫిక్స్‌ వర్క్‌లో ఎర్రచీర

మదర్‌ సెంటిమెంట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ఎర్రచీర. గ్రాఫిక్‌ హంగులు పులుముకుంటోంది. బేబి ఢమరి సమర్పణలో, శ్రీసుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్‌ పతాకంపై సి.హెచ్‌ సత్యసుమన్‌ బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. బేబి సాయితేజశ్విని, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. హర్రర్‌, యాక్షన్‌, సస్పెన్స్‌తో కూడిన కథ కావడంతో గ్రాఫిక్స్‌ ముఖ్య భూమికను పోషించనున్నాయి. కాగా దర్శకులు సి.హెచ్‌.సత్య సుమన్‌బాబు కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్‌, మాటలు: గోపీ విమలపుత్ర, ఫైట్స్‌:నందు, కెమెరా: చందు, ఆర్ట్‌: సుభాష్‌, నాని, సంగీతం: ప్రమోద్‌ పులిగిల్ల.