మహానటి టీమ్‌కు ప్రహ్లాద్‌ జోషి అభినందనలు

మహానటి టీమ్‌కు ప్రహ్లాద్‌ జోషి అభినందనలు

18-09-2019

మహానటి టీమ్‌కు ప్రహ్లాద్‌ జోషి అభినందనలు

ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్‌ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత ప్రియాంక దత్‌ను అభినందించిన ప్రహ్లాద్‌ జోషీ.. మహానటి చిత్ర గొప్పతనాన్ని అడిగి తెలుసుకున్నారు. అశ్వినీదత్‌ నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. 20 నిమిషాలపాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు. అశ్వీనీదత్‌ మాట్లాడుతూ ఈ రోజు గొప్ప అవకాశం లభించింది. కేంద్ర మంత్రి వచ్చి నాగ్‌ అశ్విన్‌, ప్రియాంకలను అభినందించారు. మేం జీఎస్టీ విషయంలో సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. భారతంలో కాశ్మీర్‌ ఒకటని చాటిచెప్పారు. మా నుంచి ప్రభుత్వానాకి అన్ని రకాల సహకారాలుంటాయని ప్రహ్లాద్‌ జోషికి చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్కేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు.