రకుల్ జిమ్ ని లాంచ్ చేసిన అఖిల్, రానా
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

రకుల్ జిమ్ ని లాంచ్ చేసిన అఖిల్, రానా

18-03-2017

రకుల్ జిమ్ ని లాంచ్ చేసిన అఖిల్, రానా

ఇటు తెలుగు, అటు తమిళంలో దూసుకుపోతున్న గ్లామర్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మహేష్‌ మూవీతో పాటు బెల్లంకొండ శ్రీను చిత్రం, నాగ చైతన్య మూవీస్‌ లలో కథానాయికగా నటిస్తుంది. తమిళంలోనూ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. అయితే సినిమాలతో ఇంత బిజీగా ఉన్నప్పటికి ఆ మధ్య గచ్చిబౌలిలో స్టూడియో 45 అనే ఫిట్‌ నెస్‌ స్టూడియోని ప్రారంభించింది రకుల్‌. ఇప్పుడు దీనిని బ్రాంచ్‌ గా విశాఖపట్నంలోని డస్పల్లా హిల్స్‌ ప్రాంతంలో ఫంక్షనల్‌ 45 స్టూడియోని ప్రారంభించింది. తాజాగా టాలీవుడ్‌ హీరోలు దగ్గుబాటి రానా, అక్కినేని అఖిల్‌ లు ఈ  జిమ్‌ ని లాంచ్‌ చేశారు. అత్యంత పాష్‌ గా ఉండే డస్పల్లా హిల్స్‌  ప్రాంతంలో రకుల్‌ ఫిట్‌ నెస్‌ స్టూడియోని ప్రారంభించిందంటే ఈ అమ్మడి రేంజ్‌ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. త్వరలో మరిన్ని ప్రాంతాలలో ఈ ఫిట్‌ నెస్‌ స్టూడియోస్‌ ని ప్రారంభించాలని రకుల్‌ భావిస్తుంది.