వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రం

వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రం

11-10-2019

వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రం

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ సంస్థలు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాయి. అల్లు అరవింద్‌ సమర్పకుడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధు ముద్ద అల్లు వెంకటేష్‌ నిర్మాతలు. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నాగబాబు క్లాప్‌నిచ్చారు. కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అల్లు అరవింద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ కొత్త తరహా కథలతో ప్రయాణం చేసే కథా నాయకుడు వరుణ్‌తేజ్‌. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. వినగానే ఓకే చెప్పారు. ఇందులో ఆయన బాక్సర్‌గా నటిస్తున్నారు. అందుకోసం అమెరికా వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలవుతుందన్నారు. సంగీతం: తమన్‌.