అమెరికాలో ప్రతిరోజూ పండగే

అమెరికాలో ప్రతిరోజూ పండగే

15-10-2019

అమెరికాలో ప్రతిరోజూ పండగే

సాయితేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే. మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. సత్యరాజ్‌ కీలక పాత్రధారి. జీఏ2, యూవీ పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్‌ నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రబృందం అమెరికా వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నేడు సాయితేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. సాయితేజ్‌ పాత్ర, తన నటన ఆకట్టుకుంటాయి. ఈ కుటంబ కథా చిత్రంలో మంచి ప్రేమకథ కూడా ఉంది. వినోదాలకు లోటుండదు అన్నారు. సంగీతం : తమన్‌.