ఆ హీరోతో నాకు నటించాలని ఉంది... కాజల్‌

ఆ హీరోతో నాకు నటించాలని ఉంది... కాజల్‌

19-10-2019

ఆ హీరోతో నాకు నటించాలని ఉంది... కాజల్‌

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ పుష్కర కాలంగా స్టార్‌ స్టేటస్‌తో కొనసాగుతోంది. తెలుగు మరియు తమిళంలో దాదాపు స్టార్‌ హీరోలందరితో కూడా నటించేసింది. సినీయర్‌ స్టార్‌ హీరోలు.., జూనియర్‌ స్టార్‌ హీరోలు అనే తేడా లేకుండా సినిమా చేసిన కాజల్‌ ప్రస్తుతం యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌తో ఇండియన్‌2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్‌తో నటిస్తున్న ఈ నేపథ్యంలో కాజల్‌ ఇక ఒకే ఒక్క హీరోతో నాకు నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది. పలువురు స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రకటించింది.