తుపాకి రాముడు టీజర్‌ విడుదల

తుపాకి రాముడు టీజర్‌ విడుదల

19-10-2019

తుపాకి రాముడు టీజర్‌ విడుదల

బిత్తిరి సత్తి హీరోగా శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌ నిర్మించిన చిత్రం తుపాకిరాముడు. టి.ప్రభాకర్‌ దర్శకుడు. ఈ నెల 25న దిల్‌ రాజు ఈ సినిమా విడుదల చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ టీజర్‌ను ఆవిష్కరించారు. ఆయన మట్లాడుతూ బిత్తిరి సత్తి వీడియోలు చూసి మా కుటుంబ సభ్యులంతా ఒత్తిడి నుంచి బయటపడతాం. తను హీరోగా మారడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఎదుటివారి ఆనందం కోరుకునే వ్యక్తి కన్నా గొప్ప హీరో ఎవరూ ఉండరు. తుపాకి రాముడు అలాంటి మంచి హృదయం ఉన్నవాడు. హాస్యం ప్రధానంగా సాగే ప్రేమకథ ఇది. తెలంగాణ సంప్రదాయాల్ని అందంగా ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ నెల 20న ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నాం అని తెలిపారు.