నాగచైతన్య జోడీగా రష్మిక ?

నాగచైతన్య జోడీగా రష్మిక ?

21-10-2019

నాగచైతన్య జోడీగా రష్మిక ?

మమ్మల్ని కథే కలిపిందనే మాట సినీ జనాల నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఆ మాట నిజం కూడా. ఎంత ప్రయత్నం చేసినా కలవన్ని కొన్ని కలయికలు, కొన్ని సార్లు కథల వల్ల కుదరిపోతుంటాయి. వాళ్లని తప్ప మరొకర్ని ఊహించుకోలేని రీతిలో ఆ పాత్రలు తెరపై పండుతుంటాయి. ఎప్పుడు ఏ కథ ఎవర్ని కలుపుతుందో ఊహించలేం. అలా ఇప్పుడు ఒక కథ నాగచైతన్య- రష్మిక జోడిని కోరుకొంటోందని తెలిసింది. శశి అనే ఓ యువ దర్శకుడు నాగచైతన్య కోసం కథని సిద్ధం చేశారు. ఆ కథలో చైతూకి జోడీగా రష్మికని ఎంపిక చేసుకోవాలనే ప్రయత్నంలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. రష్మికకి త్వరలోనే కథ వినిపించబోతున్నట్టు తెలిసింది. రష్మిక ప్రస్తుతం మహేష్‌, నితిన్‌ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జోడీ కట్టనుంది.