అలా ఛాన్సులొస్తాయనేది భ్రమ

అలా ఛాన్సులొస్తాయనేది భ్రమ

12-11-2019

అలా ఛాన్సులొస్తాయనేది భ్రమ

దర్శక, నిర్మాతలు ఇచ్చే పార్టీలకు వెళ్ళినంత మాత్రానా సినిమాల్లో అవకాశాలివ్వరు. మన దగ్గర ప్రతిభ ఉంటే వాళ్ళే తప్పకుండా ఛాన్స్‌లిస్తారు. అంతే తప్ప అవకాశాల కోసం పార్టీలకి వెళ్లను అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. యారియన్‌ తో బాలీవుడ్‌లోకి అడుగిడిన రకుల్‌కి అక్కడి ఇప్పటికి సరైన గుర్తింపు రాలేదు. అయినప్పటికీ తనవంతు శాయశక్తులా రకుల్‌ కృషి చేస్తోంది. ఇటీవల రిలీజైన దే దే ప్యార్‌ దేతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన రకుల్‌ తాజాగా మార్జావన్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది.