శ్రీశివాయ్‌ ఫిలింస్‌ కొత్త చిత్రం

శ్రీశివాయ్‌ ఫిలింస్‌ కొత్త చిత్రం

12-11-2019

శ్రీశివాయ్‌ ఫిలింస్‌ కొత్త చిత్రం

గౌతమ్‌ వ్యాస్‌, దీపికా వధాని (మిస్‌ తెలంగాణ) హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రాన్ని శ్రీశివాయ్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. స్రవంతి మురళీమోహన్‌ దర్శకత్వంలో కె.రమేష్‌బాబు నిర్మిస్తున్నారు. శ్రీమంతుడు, ఖైదీ చిత్రాల ఫేమ్‌ హరీష్‌ ఉత్తమన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్‌ విలన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. హీరో హీరోయిన్‌పై తొలి సన్నివేశం తీశారు. లవ్‌, యాక్షన్‌ను వినోదాన్ని జోడించి రూపొందిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. తదుపరి షెడ్యూల్‌ గోవాలో, ఆ తర్వాత కేరళలో షూటింగ్‌ జరుపుతారు. ఈ చిత్రానికి సంగీతం శివ నందిగామ, చీఫ్‌ అసోసియేట్‌ అనిల్‌ పురేటి, కథ, స్క్రీన్‌ప్లే గౌతమ్‌.