ఘనంగా సినీ నటీ అర్చన వివాహం

ఘనంగా సినీ నటీ అర్చన వివాహం

16-11-2019

ఘనంగా సినీ నటీ అర్చన వివాహం

సినీ నటి అర్చన వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెల్త్‌ కేర్‌ సంస్థ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జగదీష్‌తో ఆమె వివాహం గురువారం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగింది. రిసెపన్ష్‌నకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నృత్యకారిణి అయిన అర్చన 2004లో తపన సినిమాతో తెలుగు పరిశ్రమకు నటిగా పరిచయమయ్యారు. నేను చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పాండురంగడు, పౌర్ణమి, సామాన్యుడు తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన వజ్ర కవచధర గోవిందా సినిమాలోనూ ఆమె నటించారు.