అప్పుడు- ఇప్పుడు టీజర్‌ లాంచ్‌

అప్పుడు- ఇప్పుడు టీజర్‌ లాంచ్‌

16-11-2019

అప్పుడు- ఇప్పుడు టీజర్‌ లాంచ్‌

సుజన్‌, తనిష్క జంటగా నటించిన చిత్రం అప్పుడు ఇప్పుడు. చలపతి పువ్వుల దర్శకుడు. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ టీజర్‌ని విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ అనుభూతిని పంచే వినోదాత్మక చిత్రమిది. కళ్యాణ్‌ సమి విజువల్స్‌, పద్మనావ్‌ భరద్వాజ్‌ సంగీతం చిత్రానికి ప్రధానం బలం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నిన్నటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండేది? ఇప్పుడెలా మారిందనే విషయాల్ని తెరపై చూపించారు దర్శకుడు అన్నారు. శివాజీరాజా, పేరుపురెడ్డి శ్రీనివాస్‌, చైతన్య ఇతర పాత్రధారులు.