దొంగ ఫస్ట్‌లుక్‌ విడుదల

దొంగ ఫస్ట్‌లుక్‌ విడుదల

16-11-2019

దొంగ ఫస్ట్‌లుక్‌ విడుదల

కథానాయకుడు కార్తి ఖైదీగా సందడి చేశాడు. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఆయన దొంగ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖైదీ, దొంగ.. ఈ రెండు చిరంజీవి సినిమాల పేర్లే కావడం గమనార్హం. కార్తి, ఆయన వదిన జ్యోతిక ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం తంబి. ఆ చిత్రమే తెలుగులో దొంగ గా రాబోతుంది. శుక్రవారం పేరును, ఫస్ట్‌లుక్‌ని విడదల చేశారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.