మరో రీమేక్‌లో సుమంత్‌

మరో రీమేక్‌లో సుమంత్‌

19-11-2019

మరో రీమేక్‌లో సుమంత్‌

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన చిత్రం కవలుదారి. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సుమంత్‌. ఈ సినిమాకు కపటధారి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. సుమంత్‌, నందితా శ్వేత జంటగా నాజర్‌, పూజాకుమార్‌, వెన్నెల కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనుంజయ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్‌ కే కింగ్‌, డైలాగ్స్‌ : భాషా శ్రీ.