ఉపేంద్ర సరసన కాజల్‌ ?

ఉపేంద్ర సరసన కాజల్‌ ?

19-11-2019

ఉపేంద్ర సరసన కాజల్‌ ?

పదేళ్లుగా తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేసి పడేశారు కాజల్‌ అగర్వాల్‌. హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసినా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు కాజల్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు కాజల్‌. కానీ ఇంతవరకూ కన్నడ సినిమా చేయలేదు. ఉపేంద్ర చేయబోతున్న కబ్జా చిత్రంలో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారట కాజల్‌. ఆర్‌.చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కనున్న గ్యాంగ్‌స్టర్‌ చిత్రం కబ్జా. ఇందులో ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా కాజల్‌ కనిపిస్తారట. ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు నటించనున్నారు. ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్‌ కానుంది.