క్రాంతి, కె.సీమర్ జంటగా నటించిన చిత్రం పిచ్చోడు. హేమంత్ శ్రీనివాస్ దర్శక నిర్మాత. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యూ ఏజ్ యూత్‌పుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందించాం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు స్పందన బావుంది. బంటి సంగీతం, శ్రీవెంకట్, శివ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ అవుతుంది అని అన్నారు. సమీర్, సత్యా కృష్ణా, అభయ్, అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్: గోపి అమితాబ్, ఎడిటర్ :సంతోశ్ గడ్డం.