కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌గా ప్రభుదేవా

కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌గా ప్రభుదేవా

21-11-2019

కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌గా ప్రభుదేవా

పోకిరి లో మహేష్‌బాబు పోషించిన పాత్ర పేరు.. కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌. అదే పేరుతో ప్రభుదేవా హీరోగా ఓ చిత్రం తెరకెక్కింది. తమిళ చిత్రం పొన్‌ మానిక్కవేల్‌ కు అనువాదమిది. ముఖిల్‌ చెల్లప్పన్‌ దర్శకుడు. నివేతా పేతురాజ్‌ నాయిక. ఆర్‌.సీతారామరాజు నిర్మిస్తున్నారు. యనమల సుధాకర్‌ నాయడు సమర్పిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో విడుదలవుతోంది. సంఘవిద్రోహ శక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచిన పోలీసు అధికారి పాత్రలో ప్రభుదేవా చక్కటి వినోదం పంచుతాడు. తమిళ, తెలుగుభాషల్లో ఓకేసారి చిత్రం విడుదలవుతుందన్నారు నిర్మాత.