తోలుబొమ్మల సిత్రాలు షూటింగ్‌ పూర్తి

తోలుబొమ్మల సిత్రాలు షూటింగ్‌ పూర్తి

06-12-2019

తోలుబొమ్మల సిత్రాలు షూటింగ్‌ పూర్తి

కోమారి జానకిరామ్‌ డైరెక్షన్‌లో తోలుబొమ్మల సిత్రాలు పతాకంపై ప్రొడక్షన్‌ 1 సినిమా పాటు వినా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. పాత, కొత్త నటులతో రూపొందిన సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ జరుపుకుంటోంది. దర్శకుడు జానకిరామ్‌ సినిమా విశేషాలు చెబుతూ సినిమాను అంతర్వేది, మచిలీపట్నం, శ్రీశైలం, వికారాబాద్‌, హైదరాబాద్‌ లొకేషన్లలో నిర్మించాం. ఇది నా తొలి సినిమా. పాట వినా షూటింగ్‌ పూర్తైంది. ప్రస్తుతం ఐటెమ్‌ సాంగ్‌ కోసం సెట్‌ వేస్తున్నాం. లవ్‌, సెంటిమెంట్‌, కామెడీ, హారర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ సినిమాలో ఉన్నాయి. కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడేవారికి కనెక్టయ్యే సినిమా. కొమరక్క, స్వప్న, వేదం నాగయ్య, పద్మారావు, ఆదినారాయణ, గోవిందరాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.