మెగాస్టార్‌ సరసన మళ్లీ త్రిష ?

మెగాస్టార్‌ సరసన మళ్లీ త్రిష ?

07-12-2019

మెగాస్టార్‌ సరసన మళ్లీ త్రిష ?

తమిళంలో అసాధారణ విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేయకపోవడం వల్ల త్రిషకు మేలు జరగలేదు కానీ.. లేకుంటే తెలుగులోనూ ఆమె పేరు మారు మ్రోగిపోయేది. త్రిష టైమ్‌ అయిపోయింది అనే కామెంట్స్‌ వినిపిస్తున్న తరుణంలో.. ఆ విజయం త్రిషకు దక్కింది. ఇప్పుడు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌ ఛాన్స్‌ త్రిష కొట్టేసిందని సమాచారం. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్టాలిన్‌లో చిరంజీవి సరసన నటించిన త్రిష.. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో జోడీ కట్టనుండడం గమనార్హం.