అభిమాని కుటుంబానికి మెగాస్టార్‌ పరామర్శ

అభిమాని కుటుంబానికి మెగాస్టార్‌ పరామర్శ

09-12-2019

అభిమాని కుటుంబానికి మెగాస్టార్‌ పరామర్శ

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ మహ్మద్‌ గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి హుటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఘన నివాళులర్పించారు. మహ్మద్‌ కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ నూర్‌ అహ్మద్‌ తన వీరాభిమాని అని ఆయన మరణం తీరనిటోటని బాధను వ్యక్తం చేశారు. ఆయన్ని తిరిగి తీసుకురాలేమని కానీ.. వారి కుటుంబానికి అండగా ఉంటానని చెబుతూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.