మెగా అభిమాని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

మెగా అభిమాని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

10-12-2019

మెగా అభిమాని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణంతో మెగా కుటుంబం వెంటనే స్పందించింది. విషయం తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఒక ప్రకటన చేస్తూ తాను హైదరాబాద్‌కు రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్ని కలుస్తానని, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. నూర్‌ అహ్మద్‌ మెగా అభిమానుల్లోకెల్లా గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన తమ పేరు మీద ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన లేని టోటు తీరనిదని సంతాపం ప్రకటించారు.