అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

11-01-2020

అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి అరుదైన పురస్కారం దక్కింది. సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారాన్ని అందించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌-2019 పురస్కారాన్ని స్వీకరించనున్నారు. ఆయనతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును అందుకోనున్నారు.