ఆచారి అమెరికా యాత్ర ప్రారంభం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ఆచారి అమెరికా యాత్ర ప్రారంభం

20-03-2017

ఆచారి అమెరికా యాత్ర ప్రారంభం

మంచు విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆచారి అమెరికా యాత్ర చిత్రం తిరుపతిలో ప్రారంభమైంది. ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసిన దేవుడి చిత్ర పటాలకు ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు, ఆయన సతీమణి నిర్మల, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు పూజలు చేశారు. అనంతరం హీరో విష్ణు బ్రహ్మానందంపై మూహూర్తం షాట్‌ తీశారు. విష్ణు బ్రహ్మానందంతో గురువుగారు మన అమెరికాయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించండి అంటూ ఇందుకు బ్రహ్మానందం విజయోస్తూ, దిగ్విజయోస్తు అని విష్ణును దీవించే డైలాగ్‌ చిత్రీకరించారు. మాజీ ఎంపీ, మాజీ  టీటీడీ బోర్డు చైర్మన్‌ సుబ్బరామిరెడ్డి క్లాప్‌ కొట్టగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం కృష్ణంరాజు స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సినిమాకు హీరోయిన్‌ హమీరాదస్తూర్‌, కాగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌చంద్ర, కెమెరామెన్‌ సిద్ధార్థ, మాటల రచయిత డార్లింగ్‌ స్వామి, స్క్రీన్‌ ప్లే వర్మ, నివాస్‌, రాజు నిర్మాత ఎంఎల్‌ కుమార్‌చౌదరి, కిట్టు కీర్తి.