రైతులతో రజనీ భేటీ
APEDB
Ramakrishna

రైతులతో రజనీ భేటీ

19-06-2017

రైతులతో రజనీ భేటీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 16 మంది రైతుల బృందంతో భేటీ అయ్యారు. నదుల అనుసంధానికి రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు పి.అయ్యాకన్ను రైతుల బృందానికి నాయకత్వం వహించారు. నదుల అనుసంధానంపై రైతుల వినతిని ప్రధాని మోదీకి చేరవేస్తాననీ రజనీ అన్నట్లు అయ్యాకన్ను తెలిపారు. భేటీ అనంతరం అయ్యాకన్ను మాట్లాడుతూ నదుల అనుసంధానానికి రూ.కోటి రజనీ ఇప్పుడే ఇస్తానన్నారు. ప్రధాని మోదీకి ఇవ్వాలని మేం ఆయనను కోరామన్నారు. నదుల అనుసంధానానికి రూ.కోటిని రజనీ 2002లో ప్రకటించారు.