Telangana Tourism
Karur Vysya Bank
Manjeera Monarch

మిస్టర్ ఇండియా2 లో అందాల సుందరి

19-06-2017

మిస్టర్ ఇండియా2 లో అందాల సుందరి

శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ జంటగా నటించిన చిత్రం మిస్టర్‌ ఇండియా. 1987లో వచ్చిన ఈ చిత్రం హిందీచిత్ర పరిశ్రమలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మిస్టర్‌ ఇండియా-2 రాబోతోంది. ఇందులోనూ అనిల్‌ కపూర్‌, శ్రీదేవినే నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం భర్త బోనీ కపూర్‌ నిర్మాణంలో వస్తున్న మామ్‌ చిత్రంలో శ్రీదేవి నటిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యాక శ్రీదేవి మిస్టర్‌ ఇండియా 2లో నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మిస్టర్‌ ఇండియాకి దర్శకత్వం వహించిన శేఖర్‌ కపూర్‌, తాజా సినిమాకి దర్శకత్వం వహించనని ఇదివరకే వెల్లడించారు. దాంతో కొత్త దర్శకుడిగా ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం. మామ్‌ చిత్రం జులై 7న విడుదల కాబోతోంది.