అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక
Nela Ticket
Kizen
APEDB

అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక

19-06-2017

అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక

64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. స్థానిక హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ వేడుకలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దక్షిణాది సినీరంగంలో వివిధ భాషల్లో, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ఈ వేడుకలో అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీరంగానికి సంబంధించి ఈ అవార్డులు అందుకున్న విజేతల విషయానికి వస్తే, ఉత్తమనటుడిగా ఎన్టీఆర్‌ (నాన్నకు ప్రేమతో), ఉత్తమ నటిగా సమంత (అ..ఆ) అవార్డులను అందుకోగా, ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి (ఊపిరి), ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు (నాన్నకు ప్రేమతో), ఉత్తమ సహాయనటిగా నందితాశ్వేత (ఎక్కడికిపోతావు చిన్నవాడా), ఉత్తమ నేపథ్యగాయకుడిగా కార్తీక్‌( అ..ఆ- ఎల్లిపోకే శ్యామల), ఉత్తమ నేపథ్యగాయని చిత్ర (నేనుశైలజ-ఈప్రేమకీ..), ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్యశాస్త్రి, (జనతాగ్యారేజ్‌), ఉత్తమ మ్యూజిక్‌ అల్బమ్‌ దేవిశ్రీప్రసాద్‌( నాన్నకు ప్రేమతో) ఫిల్మ్‌కేర్‌ క్రిటిక్‌ అవార్డు (నటుడు) అల్లుఅర్జున్‌ (సరైనోడు), ఫిల్మ్‌ఫేర్‌ క్రికెట్‌ అవార్డు (నటి) రీతూవర్మ( పెళ్లిచూపులు)లకు అవార్డులు లభించాయి. కృష్ణ , విజయనిర్మల ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, సమంత, రానా, సూర్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఖుష్బూ, మాధవన్‌ తదితర తారలు ఈ వేడుకలో సందడి చేశారు.