ట్విట్టర్‌లో మహేశ్‌కు 3 మిలియన్ల ఫాలోవర్లు
Ramakrishna

ట్విట్టర్‌లో మహేశ్‌కు 3 మిలియన్ల ఫాలోవర్లు

11-03-2017

ట్విట్టర్‌లో మహేశ్‌కు 3 మిలియన్ల ఫాలోవర్లు

సినిమాల పరంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనకంటూ కొన్ని రికార్డులు సృష్టించుకున్నాడు. సినిమాల్లో తప్పితే బయట పెద్దగా హంగామా చేయని ప్రిన్స్.. ట్విట్టర్‌లో మాత్రం యాక్టివ్‌గా స్పందిస్తుంటాడు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి, కూతురు ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్ బాబు. అభిమానం పరంగా కూడా మహేశ్ అభిమానులను బాగానే సంపాదించుకున్నాడు. ఇక, ట్విట్టర్లోనూ భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ఈ సూపర్ స్టార్. 30 లక్షల మంది అంటే మూడు మిలియన్ల మంది మహేశ్‌ను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. దక్షిణాది హీరోల్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన హీరోగా మహేశ్ మూడో స్థానంలో నిలిచాడు. అత్యధికంగా ధనుష్ 44 లక్షలు, ఆ తర్వాత అతడి మామ రజనీకాంత్ 36 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక, మహేశ్ కంటే ముందు హీరోయిన్లు సమంత, త్రిష, శ్రుతి హాసన్‌కు ట్విట్టర్లో మూడు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తెలుగు విషయానికొస్తే.. డైరెక్టర్ రాజమౌళికి మహేశ్ తర్వాత 28 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 2.7 మిలియన్లు, హీరో రానా 2.5 మిలియన్లు, నాగార్జునను 2.2 మిలియన్ల మంది ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. ఇటీవలే ట్విట్టర్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కు కేవలం 1.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు. అల్లు అర్జున్‌ను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.