ప్రభాస్ పెళ్లిపై చెల్లెలి క్లారిటీ!
Kizen
APEDB

ప్రభాస్ పెళ్లిపై చెల్లెలి క్లారిటీ!

09-08-2017

ప్రభాస్ పెళ్లిపై చెల్లెలి క్లారిటీ!

మొన్నటి వరకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి డేట్‌ ఎప్పుడు అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ మధ్య సోషల్‌ మీడియాలో ప్రభాస్‌, అనుష్క కి పెళ్ళి జరుగనుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. వాటిని ప్రభాస్‌ ఖండించారు. అయితే ప్రభాస్‌ పెళ్ళితో పాటు పలు విషయాలకి సంబంధించి ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణం రాజు కూతురు సాయి ప్రకీర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కృష్ణం రాజుకు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, సాయి ప్రసీద అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ముగ్గురికి ప్రభాస్‌ ఒక్కడే అన్నయ్య. ఇలాంటి అన్నయ్య తమకు దొరకడం తమ అదృష్టమని అంటున్నారు ముగ్గురు చెల్లెళ్ళు. సినిమా షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే వారితోనే ఎక్కువ టైం కేటాయిస్తాడట ప్రభాస్‌. ఇక టూర్స్‌ కి వెళ్ళినప్పుడు వారి కోసం సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్స్‌ తెస్తాడట. ఇక వారి అన్నయ్య పెళ్లి కోసం ఈ చెల్లెళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. సినిమాలతో బిజీగా ఉండడం వలన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఏ రోజున ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదని సాయి ప్రకీర్తి అన్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.