బాహుబలి ఖాతాలో మరో రికార్డు
MarinaSkies
Kizen

బాహుబలి ఖాతాలో మరో రికార్డు

10-08-2017

బాహుబలి ఖాతాలో మరో రికార్డు

దర్శకధీరుడు రాజహౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ బాహుబలి ది బిగినింగ్‌ ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో అందరికీ తెలిసిందే. దాని సీక్వెల్‌ గా వచ్చిన బాహుబలి ది కంక్లూజన్‌ భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే రూ.1000 కోట్ల వసూళ్ల సాధించిన తొలి చిత్రంగా చరిత్ర లిఖించింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయల వసూళ్ల చేసి సాధించిన ఈ సినిమా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే రికార్డుస్థాయి ధరకు ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ మధ్య కాలంలో భారత్‌లో అడుగుపెట్టిన కంటెంట్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ నెట్‌ప్లిక్స్‌ బాహుబలి-2 డిజిటల్‌ రైట్స్‌ ను రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది. రూ.25.5 కోట్లకు బాహుబలి-2 డిజిటల్‌ రైట్స్‌ను తన సొంతం చేసుకుంది. బాహుబలి-2 హిందీ, మలయాళ సినిమాలు నెట్‌ప్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగతా భాషల్లో కూడా బాహుబలి 2 అందుబాటులోకి రానుంది.