రాజకీయాల్లోకి కమల్‌ హాసన్‌ ?

రాజకీయాల్లోకి కమల్‌ హాసన్‌ ?

31-08-2017

రాజకీయాల్లోకి కమల్‌ హాసన్‌ ?

తన రాజకీయ ప్రవేశంపై విలక్షణ నటుడు కమలహాసన్‌ సృష్టతనిచ్చారు. అవినీతిపై పోరాడేందుకు తాను నిర్ణయించుకున్నానని, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఓ అభిమాని వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కమలహాసన్‌, అక్కడివారిని ఉద్దేశించి మాట్లాడారు. మెరుగైన సమాజ నిర్మాణమే తన లక్ష్యమని, ఈ దిశగా, తనతో కలిసి నడిచేందుకు యువత కదలి రావాలని పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకుంటే  ప్రశ్నించే హక్కును కోల్పోతామని పేర్కొన్న కమల్‌, ఎవరూ తమ ఓట్లను డబ్బు తీసుకుని వేయరాదని కోరారు. కాగా, కమల్‌ మాటలతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరింత సృష్టత వచ్చినట్లుయింది. అయితే కొత్త పార్టీ పెడతారా? లేక ప్రస్తుతమున్న ఏదైనా జాతీయ లేదా స్థానిక పార్టీలో చేరతారా? అన్న విషయాన్ని కమల్‌ ప్రస్తావించలేదు.