నోబుల్ స్టార్ నారా రోహిత్ విడుదల చేసిన "పెంపక్" టీజర్ !!
Ramakrishna

నోబుల్ స్టార్ నారా రోహిత్ విడుదల చేసిన "పెంపక్" టీజర్ !!

01-09-2017

నోబుల్ స్టార్ నారా రోహిత్ విడుదల చేసిన

 ఇటీవల కాలంలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న చిన్న చిత్రం "పెంపక్" (ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం). థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరు తో కలిసి స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రకాంత్-రాధికా మెహరోత్రా-పల్లవి డోరా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ నోబుల్ స్టార్ నారా రోహిత్ విడుదల చేసి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని.. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నానని నారా రోహిత్ అన్నారు. 

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న "పెంపక్" ఫస్ట్ సింగిల్ ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్ రిలీజ్ చేయగా.. రెండో పాటను మరో ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేశారు. మూడో పాటను బిగ్ ఎఫ్ ఎంలో లాంచ్ చేశారు. 

తమ చిత్రం టీజర్ నారా రోహిత్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని.. తమందరికీ ఈ చిత్రం మంచి లైఫ్ ఇస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాత గోవర్ధన్, హీరో చంద్రకాంత్, హీరోయిన్స్ రాధికా మెహరోత్రా, పల్లవి డోరా అన్నారు. ఈ వారంలో ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 15న తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు!!!