మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ప్రకటించిన బాలకృష్ణ
Ramakrishna

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ప్రకటించిన బాలకృష్ణ

06-09-2017

మోక్షజ్ఞ  ఎంట్రీ ఎప్పుడో ప్రకటించిన బాలకృష్ణ

తన తనయుడు మోక్షజ్ఞని త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తున్నట్లు కథనాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నేడు మోక్షజ్ఞ బర్త్‌డే. ఈ సందర్భంగా బాలకృష్ణ మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. తన నియోజకవర్గమైన అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. అభిమానులను సంపాదించుకోవడం గొప్ప వరమని, వారే తనకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా అన్నారు. తనను ఆదరించినట్టే తన కుమారుడ్ని కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  వచ్చే ఏడాది జూన్‌ మొదటి వారంలో మోక్షజ్ఞ తొలి సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. తన 101వ చిత్రం పైసా వసూల్‌ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.