ఆడియో దుబాయ్‌... టీజర్‌ హైదరాబాద్‌లో
Nela Ticket
Kizen
APEDB

ఆడియో దుబాయ్‌... టీజర్‌ హైదరాబాద్‌లో

07-09-2017

ఆడియో దుబాయ్‌... టీజర్‌  హైదరాబాద్‌లో

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 2.0. ఇదే కాంభినేషన్‌ లో ఘన విజయం సాధించిన రోబో కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 450 కోట్ల బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో 2.0పై ఉత్తరాదిలో కూడా మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే నెల నుంచి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో గ్రాండ్‌ గా ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ చేసిన చిత్రయూనిట్‌ ఆడియో రిలీజ్‌ కార్యక్రమాన్ని అక్టోబర్‌లో దుబాయ్‌  లో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ వేడుకకు కోలీవుడ్‌, బాలీవుడ్‌ నటులతో పాటు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. తరువాత నవంబర్‌లో టీజర్‌ ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఫైనల్‌ గా థియెట్రికల్‌ ట్రైలర్‌ ను డిసెంబర్‌లో చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.