బాలీవుడ్‌ నటుడు... తీవ్ర అస్వస్థత
MarinaSkies
Kizen

బాలీవుడ్‌ నటుడు... తీవ్ర అస్వస్థత

11-09-2017

బాలీవుడ్‌ నటుడు...  తీవ్ర అస్వస్థత

అమెరికా సంతతికి చెందిన వెటరన్‌ బాలీవుడ్‌ నటుడు టామ్‌ ఆల్టర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అది కూడా ఫోర్త్‌ స్టేజ్‌లో ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. 67 ఏళ్ల టామ్‌కు 2008లో పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. గాంధీ, క్రాంతి, ఆషికిలాంటి హిట్‌ మూవీస్‌లో టామ్‌ ఆల్టర్‌ నటించాడు. చివరిసారి 2017లో రిలీజైన్‌ సర్గోషియా మూవీలో ఆల్టర్‌ కనిపించాడు. 1976లో చరస్‌ అనే మూవీతో టామ్‌ ఆల్టర్‌ యాక్టింగ్‌ కెరీర్‌ మొదలైంది. అమెరికా సంతతికి చెందిన నటుడే అయినా హిందీ, ఉర్దూ భాషలపై అతనికి మంచి పట్టుంది. స్టేజ్‌ షోలలో అతను పోషించిన మౌలానా ఆజాద్‌, మీర్జా ఘాలిబ్‌ పాత్రలకు మంచి పేరొచ్చింది. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో టామ్‌ ఆల్టర్‌ జన్మించాడు.