నటుడు చిన్నా భార్య కన్నుమూత
MarinaSkies
Kizen

నటుడు చిన్నా భార్య కన్నుమూత

12-09-2017

నటుడు చిన్నా భార్య కన్నుమూత

సీనియర్ నటుడు చిన్నా భార్య శిరీష(42) కన్నుమూసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప అనారోగ్యమే అనుకున్నారు. అయితే అకస్మాత్తుగా చనిపోవటంతో విషాదంలో ఉంది చిన్నా కుటుంబం. నిన్న, మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న భార్య.. సడెన్ గా చనిపోవటంతో షాక్ లో ఉన్నాడు చిన్నా. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.

రాంగోపాల్ వర్మ ఫస్ట్ మూవీ శివ మూవీతో చిన్నాకి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కామెడీ పాత్రలు చేశాడు. చిన్నా – జేడీ చక్రవర్తి జోడీలో వచ్చిన సినిమాలన్నీ హిట్. ఆ ఇంట్లో అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియల్స్ కూడా నటించాడు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని.. ఫ్యామిలీకి బాగా విలువ ఇస్తానని చాలా సందర్భాల్లో వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సినీ కెరీర్, కుటుంబం పరంగా భార్య శిరీష్ ఇచ్చిన మద్దతు వల్లే ఈస్థాయికి వచ్చినని చెబుతుండేవాడు చిన్నా. భార్య శిరీష మరణంతో విషాదంలో ఉన్న చిన్నా కుటుంబాన్ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.  సంతాపం తెలిపారు.