ప్రకాష్‌రాజ్‌కు అరుదైన గౌరవం
Sailaja Reddy Alluddu

ప్రకాష్‌రాజ్‌కు అరుదైన గౌరవం

11-10-2017

ప్రకాష్‌రాజ్‌కు అరుదైన గౌరవం

బహుభాషా నటుడు ప్రకాష్‌రాజుకు జ్ఞానపీఠ స్వీకర్త డాక్టర్‌ శివరాం కారంత్‌ హుట్టూర పురస్కారాన్ని నిర్వాహకులు ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కోట గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కోట గ్రామాన్ని చేరుకున్న ఆయన శివరాం కారంత్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. పురస్కారాన్ని స్వీకరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.