గెలుపు, ఓటమి రెండింటినీ ఒకేలా స్వీకరించాలి
Sailaja Reddy Alluddu

గెలుపు, ఓటమి రెండింటినీ ఒకేలా స్వీకరించాలి

11-10-2017

గెలుపు, ఓటమి రెండింటినీ  ఒకేలా స్వీకరించాలి

పరిగెత్తి పాలుతాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది పాత సామెత. దాన్ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కాస్త మార్చే ప్రయత్నం చేసింది. పరిగెత్తి పాలు తాగడమే నయం అంటోంది. జీవితం ఓ పరుగు పందెం. గెలవాలంటే అందరికంటే ముందు ఉండాల్సిందే. చేద్దాం చూద్దాం అంటే కుదరదు. మనకు, మన ప్రతిభకు దక్కాల్సిన ఫలాలు రాకుండానే పోతాయి అని హెచ్చరిస్తోంది. సినిమా పరిశ్రమలోనే కాదు, అన్నిటా పోటీ ఉంటుంది. మనకంటూ ఓ స్థానం ఏర్పరచుకోవాలంటే బద్దకంగా కూర్చుంటే కుదరదు. పోటీ పడాల్సిందే. అయితే ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన మొత్తం జీవితంలోనే ఓడిపోయినట్టు కాదు. గెలుపు ఓటమి రెండింటినీ ఒకేలా స్వీకరించాలి. ఆ ధైర్యం ఉంటేనే జీవితాన్ని ఓ పోటీ అనుకోవాలి. గెలిచినా, ఓడినా ఆ స్ఫూర్తి మాత్రం మర్చిపోకూడదని  హితవు చెబుతోంది.