చర్లపల్లి జైల్లో నవదీప్‌

చర్లపల్లి జైల్లో నవదీప్‌

20-10-2017

చర్లపల్లి జైల్లో నవదీప్‌

ప్రముఖ నటుడు నవదీప్‌ హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్‌ జైలుకి వెళ్లారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన నటుడు ఆదర్శ్‌తో కలిసి జైలుని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని వారితో పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను నవదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నవదీప్‌, ఆదర్శ్‌ కలిసి నటిస్తున్న సినిమా చిత్రీకరణ చర్లపల్లిలో జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నవదీప్‌ జైలు సిబ్బందితో దీపావళి జరుపుకొన్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ షోలో నవదీప్‌, ఆదర్శ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.