మనసున్న మా రాజు కావాలి

మనసున్న మా రాజు కావాలి

11-11-2017

మనసున్న మా రాజు కావాలి

ఈ రోజుల్లో పెళ్లికి ముందు లవ్‌ ఎఫైర్స్‌ కామన్‌ అయిపోయాయి. ప్రేమ విషయంలో అబ్బాయి ఆలోచన ఒకరకంగా ఉంటుంది. అమ్మాయి యాంగిల్‌ వేరేగా ఉంటుంది. అబ్బాయి ప్రేమను కోరుకుంటాడు. అమ్మాయి లైఫ్‌ లో సెక్యూరిటీని కోరుకుంటుంది. సినీతారలు కూడా ఇందుకు తీసిపోరు. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ తన కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకి కాబోయే వరుడు ఇలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ అయితే పెళ్లి ఆలోచన చేయలేదనీ, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదని చెప్పింది. అయితే కాబోయేవాడు అందగాడు కాకపోయినా ఫరావాలేదనీ, మంచి మనసున్నవాడైతే చాలని అంటుంది. వరుసగా వస్తోన్న సక్సెస్‌లు తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని కాజల్‌ చెప్పింది. కాబట్టి తాను ప్రస్తుతం కెరీర్‌ పైనే పూర్తి దృష్టి పెట్టానని అంటుంది.