అంగరంగ వైభవంగా చై, సమంత పెళ్లి రిసెప్షన్‌

అంగరంగ వైభవంగా చై, సమంత పెళ్లి రిసెప్షన్‌

13-11-2017

అంగరంగ వైభవంగా చై, సమంత పెళ్లి రిసెప్షన్‌

టాలీవుడ్‌ కొత్త జంట నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌ హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కొత్త జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు, సినీ రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు తరలి వచ్చారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఉత్తేజ్‌, ఆర్‌ నారాయణమూర్తి తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.

Click here for Event Gallery