రజనీతో కలిసి పని చేస్తా
Sailaja Reddy Alluddu

రజనీతో కలిసి పని చేస్తా

13-11-2017

రజనీతో కలిసి పని చేస్తా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని సినీ నటుడు కమలహాసన్‌ అన్నారు. చెన్నైలో కమలహాసన్‌ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన తదుపరి రాజకీయ సమావేశం సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అన్నారు. నిజానికి తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదే విధంగా బీజేపీ తదితర పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లు భావించడం సరికాదన్నారు. రజనీకాంత్‌ గురించి ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారని, రజనీ తాను మంచి మిత్రులమని చెప్పారు. ఇద్దరి రాజకీయపరమైన సిద్దాంతాలు, అభిప్రాయాలు కలిస్తే రాజనీకాంత్‌తో కలిసి పని చేయడానికి తాను సిద్ధమేనని కమల్‌ సృష్టం చేశారు.