తెలుగుదేశంలోకి వాణీ విశ్వనాథ్‌

తెలుగుదేశంలోకి వాణీ విశ్వనాథ్‌

13-11-2017

తెలుగుదేశంలోకి వాణీ విశ్వనాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీనటి వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతపురం ప్రజలు చూసిన అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని, తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని సృష్టం చేశారు.